![]() |
![]() |
.webp)
సోహైల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మంచి ఫేమ్ తెచ్చుకున్న కంటెస్టెంట్. అలాగే కొన్ని మూవీస్ లో నటించాడు. కళింగపట్నం అనే రెస్టారెంట్ ని స్టార్ట్ చేసాడు. రీసెంట్ గా ప్రపంచ యాత్రికుడు ఐన యూట్యూబర్ నా అన్వేషణ సోషల్ మీడియాలో సోహైల్, మెహబూబ్ తో పాటు కొంతమందిని ఉగ్రవాదులతో పోల్చుతూ ఒక వీడియో రిలీజ్ చేసాడు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వాళ్లందరినీ ఉగ్రవాదులు అంటూ కామెంట్ చేసాడు. దాని మీద సోహైల్ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. "పహాల్గమ్ దాడికి బెట్టింగ్ యాప్స్ కి లింక్ పెట్టి నన్ను ఉగ్రవాది అని ముద్ర వేయడం ఏమిటి ? నన్ను ఉగ్రవాది అనేసరికి నేను చాలా హార్ట్ అయ్యాను.
ఎవరో నన్ను ఉగ్రవాది అన్నంత మాత్రాన నేను అది కాదు కదా. నేను ఇండియన్ ముస్లిం అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతాను. నేను శివుడికి పాలాభిషేకం చేసాను. సంక్రాంతికి అప్పాలు చేసుకునేవాళ్లం. రంజాన్ వస్తే నా హిందూ ఫ్రెండ్స్ వచ్చి మసీదుకు వచ్చి నాతో పాటు నమాజ్ చేసేవాళ్ళు. గ్లాడ్ విన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో కలిసి మేమంతా చర్చి కి వెళ్ళేవాళ్ళం. మా ఇంటి దగ్గర వాళ్ళతో కొండగట్టుకు వెళ్ళేవాళ్ళం. మాకు చికెన్ పాక్స్ వచ్చినప్పుడు పోచమ్మ తల్లి వచ్చిదంటూ మాకు దిగదుడిసే వాళ్ళు...అలాంటి వాతావరణంలో పెరిగిన ఎంతో మంది ముస్లిమ్స్ ఉన్నారు. అందులో నేను ఒకడిని. ఎక్కడో ఎవరో దాడులు చేస్తే వాళ్ళను అనకుండా ఇక్కడ మనకు మనం కొట్టుకునేలా చేసుకుంటున్నాం. మనం మనం గొడవలు పడుతూ ఉంటే మనం ఫెయిల్ అయ్యాము..వాళ్ళు సక్సెస్ అయ్యారు. మతం పేరుతో మనం మనం కొట్టుకుంటే ఎం వస్తుంది. నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. టెర్రరిస్టులకు ఏ మతం ఉండదు. ఇస్లాంలో ఒకటి ఉంటుంది నేను పుట్టించిన మనిషిని చంపే హక్కు నీకు లేదు అని ఉంటుంది. ఇప్పుడు ఇంత చేసిన వాళ్ళు ముస్లిమ్స్ కాదు అసలు రియల్ ముస్లిమ్స్ కాదు. మా అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయింది. ఆమెను ఎన్నో మాటలు అన్నావ్. నీకు అమ్మ ఉంది. కానీ నేను నీలా అనను. నువ్వు తిట్టినట్టు నేను కూడా తిట్టొచ్చు కానీ నేను అలా చేయను. తల్లులు ఎం చేసారు. కని పెంచి ఇంతవరకు తీసుకొచ్చారు. బతికే నాలుగు రోజుల కోసం ఇదంతా అవసరమా. హ్యాపీగా ఉంటే చాలుగా. ఇస్లాంలో ఇదే చెప్తారు. మీ మతాన్ని ప్రేమించండి..పక్క మతాన్ని గౌరవించండి అని..అందరం కలిసి ఉంటే మంచిది" అని చెప్పాడు సోహైల్.
![]() |
![]() |